కరోనా: అసత్యాలు ప్రచారం చేస్తే కఠిన చర్యలు

CoronaVirus: AP DGP Gowtham Sawang Warns Against Rumours - Sakshi

కొత్త ఛాలెంజ్‌ను ఎదుర్కొనేందకు సిద్దం

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకున్నాం

చెక్‌పోస్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత: ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

సాక్షి, కృష్ణా : ఢిల్లీలో జరిగిన సమావేశం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో ఊహించని విధంగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారంతా స్వచ్చందంగా క్వారంటైన్‌కు రావాలిన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ఆ సమావేశానికి సంబంధించిన జాబితా ఆధారంగా చాలా మందిని ఆస్పత్రికి తరలించామన్నారు. ఏపీ నుంచి 1085 మంది ఢిల్లీ సమావేశంలో పాల్గొన్నట్లు అధికారికంగా తేలిందన్నారు. అయితే ఈ సంఖ్య మరింత ఎక్కువయ్యే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఆలస్యం అయ్యే కొద్ది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ముందే మేల్కొని ఆస్పత్రికి రావాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన విజ్ఞప్తిని డీజీపీ మరోసారి గుర్తుచేశారు.

శుక్రవారం కృష్ణా జిల్లాలో పర్యటించిన డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా కేసుల విషయంలో అసత్యాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరి మనోభావాలను దెబ్బ తీసేలా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. బ్రిటన్‌లో ఏపీకి చెందిన విద్యార్థులను తీసుకవచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పదిరోజులు లాక్‌డౌన్‌ పాటించారని.. మరో పదిరోజులు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ క్రమంలో కరోనా రూపంలో వచ్చిన కొత్త చాలెంజ్‌ను ఎదుర్కొనేందుకు డాక్టర్లు, నర్సులు, పోలీసులు, చాలా శ్రమపడుతున్నారని పేర్కొన్నారు. ‘మీ కోసం వారంతా త్యాగం చేస్తున్నారు.. మీరు ఇళ్లు వదలి రాకండి’అంటూ రాష్ట్ర ప్రజలకు డీజీపీ విజ్ఞప్తి చేశారు. 

బాపట్లలో వ్యక్తి ఆత్మహత్య వ్యవహారంలో విచారణ జరుగుతుందన్నారు. ఈ ఘటన బాదకరమని, సీఎం వైఎస్‌ జగన్‌ కూడా ఈ ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారన్నారు. పోలీస్‌ సిబ్బంది కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. ప్రజల పట్ల హ్యూమన్‌ అప్రోచ్‌తో ఉండాలని సూచించారు. ప్రజల క్షేమం కోసం పోలీసులు కుటుంబ సభ్యులను వదిలి మరీ విధులు నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ విజ్ఞప్తి చేశారు. 

చదవండి:
కరోనా : ప్రధాని మోదీకి మిథున్‌ రెడ్డి లేఖ
కరోనా: బాల మేధావి చెప్పిందే జరుగుతోందా!?

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

02-06-2020
Jun 02, 2020, 04:05 IST
ప్రేయసి మిహికా బజాజ్‌తో ఏడడుగులు వేయడానికి రానా రెడీ అవుతున్నారు. రానా, మిహికాల వివాహం ఈ ఏడాది ఆగస్టు 8న...
02-06-2020
Jun 02, 2020, 04:01 IST
తన అక్క రంగోలి కోసం ఇంటీరియర్‌ డిజైనర్‌ అవతారం ఎత్తారు కంగనా రనౌత్‌. కంగనా డిజైన్‌ చేసిన వాటిని షేర్‌...
02-06-2020
Jun 02, 2020, 03:57 IST
కరోనా కారణంగా షూటింగులు నిలిచిపోవడం, థియేటర్ల మూత వల్ల సినిమా పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని...
02-06-2020
Jun 02, 2020, 03:51 IST
బాలీవుడ్‌ ప్రముఖ సంగీత ద్వయం సాజిద్‌–వాజిద్‌ (ఈ ఇద్దరూ అన్నదమ్ములు. వాజిద్‌ చిన్నవాడు) లలో ఒకరైన వాజిద్‌ ఖాన్‌ ఇక...
02-06-2020
Jun 02, 2020, 03:48 IST
‘‘ఒక సినిమా విడుదలైన మొదటి రెండు వారాల్లో బాగుందని టాక్‌ వస్తే మూడోవారం నుంచి వసూళ్లు పెరిగే రోజులు గతంలో...
02-06-2020
Jun 02, 2020, 03:35 IST
లండన్‌: ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీని కరోనా మింగేసింది. టెన్నిస్‌ ప్రియుల్ని ఈ అంశం బాధించింది. అయితే ఫార్ములావన్‌కు...
02-06-2020
Jun 02, 2020, 00:39 IST
సిడ్నీ: ఒకవేళ టి20 ప్రపంచకప్‌ వాయిదా పడితే ఐపీఎల్‌ ఆడేందుకు తాను సిద్ధమేనని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌...
01-06-2020
Jun 01, 2020, 20:54 IST
తాజా నిర్ణయంతో కేటగిరీలను బట్టి మద్యం ధరలు రూ.2 నుంచి.. రూ.50 వరకు పెరుగనున్నాయి.
01-06-2020
Jun 01, 2020, 20:42 IST
సాక్షి, ముంబై :  లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలల పాటు మూతపడ్డ సినిమా కెమెరాలు క్లిక్‌ మనిపించేందుకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్‌ సినిమాల...
01-06-2020
Jun 01, 2020, 20:41 IST
సాక్షి,  న్యూఢిల్లీ:  కరోనా  వైరస్‌, లాక్‌డౌన్‌ సంక్షోభంలో  ఇబ్బందులు పడుతున్న వలస కార్మికులను  ఆదుకునేందుకు కార్పొరేట్‌ సంస్థల నుంచి చిన్న...
01-06-2020
Jun 01, 2020, 20:04 IST
సాక్షి, న్యూఢిల్లీ:  ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ  ఫ్లిప్‌కార్ట్‌కు భారీ షాక్‌ తగిలింది. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ ఆంక్షల నేపథ్యంలో  అమెజాన్...
01-06-2020
Jun 01, 2020, 19:48 IST
సాక్షి, న్యూఢిల్లీ: నేడు ప్రపంచంలోని పలు దేశాలకు గడగడలాడిస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారి మున్ముందు ప్రపంచ దేశాల్లో టెర్రరిజాన్ని పెంచుతుందని...
01-06-2020
Jun 01, 2020, 19:43 IST
సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఒకరు కరోనా వైరస్‌ బారినపడ్డారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యేకు కరోనా లక్షణాలు కనిపించడంతో సోమవారం జూబ్లీహిల్స్‌లోని...
01-06-2020
Jun 01, 2020, 19:35 IST
ముంబై: ‘యెహ్‌ రిష్తా క్యా కెహల్తా హై’ ఫేం నటి మోహనా కుమారి సింగ్‌తో పాటు ఆమె కుటుంబ సభ్యులకు కరోనా...
01-06-2020
Jun 01, 2020, 18:46 IST
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ సోమవారం ట్వీట్ చేశారు. భారత ప్రజాస్వామ్యంలోనే సువర్ణాధ్యాయాన్ని తెచ్చినందుకు ధన్యవాదాలు...
01-06-2020
Jun 01, 2020, 17:22 IST
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం దాదాపు మూడు నెలల అనంతరం పూర్తిస్థాయిలో ప్రత్యక్షంగా భేటీ అయింది. ప్రధాన ఎన్నికల అధికారి,...
01-06-2020
Jun 01, 2020, 16:51 IST
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పలు కీలక నిర్ణయాలను...
01-06-2020
Jun 01, 2020, 16:08 IST
సాక్షి, ముంబై:  వరుసగా నాలుగో రోజు కూడా  దేశీయ ఈక్విటీ మార్కెట్లలో లాభాలు, కరోనా వైరస్‌ కట్టడికి విధించిన రెండు...
01-06-2020
Jun 01, 2020, 15:33 IST
రోమ్‌: క‌రోనా క‌రాళ నృత్యం చేసిన ఇట‌లీలో వైర‌స్ వ్యాప్తి గ‌ణ‌నీయంగా త‌గ్గ‌డంతో ఆ దేశం ఊపిరి పీల్చుకుంటున్న విష‌యం తెలిసిందే....
01-06-2020
Jun 01, 2020, 15:17 IST
సాక్షి, ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కీలక నిర్ణయం దిశగా పయనిస్తోంది. కరోనా సంక్షోభంలో సంభవించిన వ్యాపార నష్టాలు, ఖర్చులు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top