Corona Cases in AP, District Wise List: Today 72 New COVID 19 Cases are Registered - Sakshi Telugu
Sakshi News home page

కరోనా: ఏపీలో మరో 73 పాజిటివ్‌ కేసులు

Apr 29 2020 11:11 AM | Updated on Apr 29 2020 11:51 AM

Coronavirus 73 New Positive Cases Reported In Andhra Pradesh - Sakshi

గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 7727 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 73 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం ప్రకటించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1332 కు చేరిందని వెల్లడించింది. తాజాగా 29 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారని, దీంతో కోలుకున్న వారి మొత్తం సంఖ్య 287కు చేరుకుందని తెలిపింది. వైరస్‌ బారినపడి రాష్ట్రంలో ఇప్పటివరకు 31 మంది మరణించారని, గడిచిన 24 గంటల్లో  ఎంటువంటి కోవిడ్‌ మరణాలు సంభవించలేదని వెల్లడించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 1014 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది. జిల్లాల వారీగా కరోనా బాధితులు, కోలుకున్నవారి వివరాలతో జాబితా విడుదల చేసింది. 
(చదవండి: గుర్తు తెలియని వ్యక్తి హల్‌ చల్‌)


(చదవండి: కరోనా: శ్రీకాళహస్తిలో ఇలా వ్యాపించింది! )

Advertisement
 
Advertisement
Advertisement