
చియ్యవరంలో గ్రామస్తులు పట్టుకున్న గుర్తు తెలియని వ్యక్తి (ఇన్‌సెట్‌లో) అతని సంచిలో ఉన్న మత్తుకాయలు
చిత్తూరు,తొట్టంబేడు: మండలంలోని చియ్యవరంలో గుర్తుతెలియని వ్యక్తి(41) హల్‌చల్ చేశాడు. కరోనా మహమ్మారితో ప్రజలు భయాందోళనకు గురవుతున్న సమయంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి చిన్న బ్యాగుతో గ్రామంలోకి ప్రవేశించాడు. అతన్ని ఎక్కడినుంచి వచ్చావని గ్రామస్తులు అడిగారు. పాకిస్తాన్ నుంచి వచ్చినట్లు హిందీలో సమాధానం చెప్పాడు. తనతోపాటు మరో నలుగురు కూడా వచ్చినట్లు తెలిపాడు. అతను పాకిస్తాన్ నుంచి తమకు వైరస్‌ను అంటించేందుకు వచ్చినట్లుగా భావించిన జనం వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. అతని చేతిలో ఉన్న సంచిలో ఏవో కాయలు ఉన్నాయి. అవి మత్తు కాయలుగా భావించి జనం భయపడుతున్నారు. అతను పారిపోకుండా జనం చుట్టుముట్టారు. రాత్రి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. (నాన్నా.. అమ్మ ఏది?)