స్థిరంగా అల్పపీడన ద్రోణి | Consistent with the low pressure trough | Sakshi
Sakshi News home page

స్థిరంగా అల్పపీడన ద్రోణి

Aug 12 2014 1:32 AM | Updated on Oct 16 2018 4:56 PM

స్థిరంగా అల్పపీడన ద్రోణి - Sakshi

స్థిరంగా అల్పపీడన ద్రోణి

విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.

విశాఖపట్నం: విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అల్పపీడనం ప్రస్తుతం బీహార్, జార్ఖండ్ దగ్గర్లో ఉందని, దీని ప్రభావం మనపై ఉండబోదని స్పష్టం చేసింది. రాగల 24 గంటల్లో ఇది మరింతగా క్షీణించే అవకాశాలున్నట్టు పేర్కొంది. గతేడాది మాదిరే ఈసారి కూడా ఆగస్టు చివరి వారంలోను, సెప్టెంబర్‌లోను వర్షాలు బాగా కురిసే అవకాశాలున్నట్టు వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం భారీ వర్షాలపై ఆశ లులేవని, ఉష్ణోగ్రతలు కాస్త పెరిగినపుడు ఆయా ప్రాంతాల్లో సాయంత్రంపూట ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement