రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల వంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్లను (సోషల్ మీడియా) ఉపయోగించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ల వంటి సామాజిక సంబంధాల వెబ్‌సైట్లను (సోషల్ మీడియా) ఉపయోగించుకోవాలని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది. సోషల్ మీడియా ద్వారా పార్టీ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం కల్పించాలని భావిస్తోంది. విపక్షాల విమర్శలను సాధారణ మీడియాతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా తిప్పికొట్టాలని నిర్ణయించింది.
అందులో భాగంగా నియోజకవర్గస్థాయి మొదలు పీసీసీ వరకు ముఖ్య నేతలంతా ట్విట్టర్, ఫేస్‌బుక్ ఖాతాలను ప్రారంభించేలా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈ మీడియాపై వారికి అవగాహన కల్పించేందుకు ఈనెల 7న హైదరాబాద్‌లో 15న వరంగల్ జిల్లాలో అవగాహనా సదస్సులు నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన పీసీసీ ఆఫీస్ బేరర్స్, అనుబంధ సంఘాల నేతల భేటీలో నిర్ణయించారు.