బాబు 'ఊసరవెల్లి బస్సు యాత్ర'గా మార్చుకోవాలి | Congress MLC P.Sudhakarreddy fire on TDP president N Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు 'ఊసరవెల్లి బస్సు యాత్ర'గా మార్చుకోవాలి

Aug 31 2013 10:17 AM | Updated on Mar 18 2019 7:55 PM

చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలో చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను ఊసరవెల్లి బస్సు యాత్రగా మార్చుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సీమాంధ్ర ప్రాంతంలో చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను ఊసరవెల్లి బస్సు యాత్రగా మార్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి శనివారం అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని కొన్ని రాజకీయ పార్టీలు తన ఉనికిని కాపాడుకోవడానికి ఉద్యమాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. 2014లో అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లోని శాసనసభలకు ఎన్నికలు జరుగుతాయని పొంగులేటి సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement