కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు రాయితీలు | congress gives special status for seemandhra, says JD seelam | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు రాయితీలు

Jul 6 2014 4:34 PM | Updated on Mar 23 2019 9:10 PM

కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు రాయితీలు - Sakshi

కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు రాయితీలు

రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు రాయితీల కోసం కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు రాయితీల కోసం కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలను బీజేపీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు.

 సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు కృషిచేయడం వల్లే విభజన బిల్లులో సీమాంధ్రకు నష్టం జరగకుండా రాయితీలు ఇచ్చారని జేడీ శీలం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ముందు యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీమాంధ్రకు అన్యాయం చేశారంటూ ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement