14 న మన్యం మహాధర్నా | congress conduct manyam maha dharna on july 14 | Sakshi
Sakshi News home page

14 న మన్యం మహాధర్నా

Jul 12 2017 1:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు.

విజయవాడ: విశాఖ ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృత్యువాత పడితే ప్రభుత్వం ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తుందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. గిరిజనుల మరణాలకు సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌​ చేశారు. ఏజెన్సీలపై టీడీపీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ నెల 14 న విశాఖ జిల్లా పాడేరులో ఐటీడీఏ సెంటర్‌ ఎదుట ఏపీసీసీ ఆధ్వర్యంలో మన్యం మహాధర్నాను నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.
 
ఈ మహాధర్నాను కాంగ్రెస్‌ నాయకులు, అభిమానులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. విశాఖ మన్యం ప్రాంతంలోని గిరిజనుల మరణాలు , ఆరోగ్యం, సబ్‌ ప్లాన్‌ నిధులు తదితర అంశాలపై పోరాడేందుకే ఈ ధర్నాను చేస్తున్నట్టు తెలిపారు. మన్యంలో వైద్యసేవలు మెరుగు పడటం లేదన్నారు. మూడేళ్ల నుంచి వైద్య నిపుణుల నియామకం జరగలేదని తెలిపారు. ఈ ధర్నాలో ఏఐసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ కొప్పుల రాజా, మాజీ కేంద్ర మంత్రి కిశోర్‌ చంద్రదేవ్‌ లతో పాటు రాష్ట్ర, కేంద్ర నాయకులు పాల్గొంటారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement