
ఘర్షణలో గాయపడ్డ కార్యకర్త
ఏఐసిసి పరిశీలకుని ముందే కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు.
నల్గొండ : ఏఐసిసి పరిశీలకుని ముందే కాంగ్రెస్ నేతలు బాహాబాహీకి దిగారు. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరారు. భువనగిరిలో ఈరోజు ఏఐసీసీ పరిశీకుడు సేవక్ వాంఘే సమక్షంలోనే మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు ఘర్షణపడ్డారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు ఘర్షణపడటం చూసి వాంఘే విస్తుపోయారు.
ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరువర్గాల వారు గాయపడ్డారు. రంగంలోకి దిగిన పోలీసులు కూడా గాయపడ్డారు.