'బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలి' | complaint againt balakrishna | Sakshi
Sakshi News home page

'బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలి'

Mar 10 2016 2:46 PM | Updated on Aug 29 2018 1:59 PM

మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.

శ్రీకాకుళం: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడిన బాలకృష్ణపై వెంటనే నిర్భయ కేసు నమోదు చేయాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీకాకుళంకు చెందిన న్యాయవాది ఈశ్వరమ్మ స్థానిక టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం బాలకృష్ణపై ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమెతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ఆమె తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement