ఆ జిల్లాలో ఒక్కరోజే మూడు కేసులు నమోదు

Collector Veerapandian: Three New Cases Filed In Kurnool On Saturday - Sakshi

సాక్షి, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఈ రోజు(శనివారం) 3 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నిర్ధారించినట్లు కలెక్టర్‌ వీరపాండియన్‌ తెలిపారు. కర్నూలు నగరం రోజా వీధి, అవుకు, బనాగనిపల్లె పట్టణ కేంద్రాలలో ఒక్కొక్కటి చొప్పున 3 కేసులు నిర్ధారణ అయ్యాయన్నారు. శనివారం జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నోస్సంతో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో మొత్తం 4 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆయన వెల్లడించారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం తిరుపతి, అనంతపురం కరోనా ల్యాబ్‌ల నుంచి మరిన్ని రిపోర్టులు వస్తాయని, రిపోర్టులు వచ్చిన తరువాత కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తామన్నారు.

కలెక్టర్ వీరపాండియన్ తెలిపిన వివారల మేరకు:
మొత్తం  శాంపిల్స్‌ టెస్టింగ్‌కు పంపినవి 449
వారిలో ఢిల్లీ జయాత్‌కు వెళ్లి జిల్లాకు వచ్చిన వారి శాంపిల్స్‌ టెస్టింగ్‌కు పంపినవి 338.
శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం.. అనంతపురం, తిరుపతి కరోనా ల్యాబ్‌ల నుంచి రిపోర్టులు వచ్చినవి:90 (నిన్న రాత్రి 80 నెగెటివ్)
ఈ రోజు ఉదయం రిపోర్టులు వచ్చినవి 10
వాటిలో 7 నెగటివ్;  పాజిటివ్:3 (ఢిల్లీ జమాత్ వెళ్లి వచ్చిన వారిలో) 

ప్రజలు ఆందోళన చెందకుండా.. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టడి కోసం స్థానిక అధికారులు, పోలీసులు తీసుకునే జాగ్రత్త చర్యలకు సహకరించాలని కలెక్టర్ కోరారు. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం పాజిటివ్ వచ్చిన 3 కేసుల ప్రాంతాల్లో ..కర్నూలు రోజా వీధి  చుట్టు పక్కల 3 కిలోమీటర్ల కంటైన్మెంట్ జోన్, 5 కిలో మీటర్ల బఫర్ జోన్,  అవుకు, బనాగనిపల్లె పట్టణాల్లో 3 కిలోమీటర్ల కంటైన్ మెంట్ జోన్, 7 కిలోమీటర్ల బఫర్ జోన్ ప్రకటించామని అన్నారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తులతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ అయిన వారందరూ తక్షణమే హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. వారికి కరోనా టెస్ట్ లు చేయించడానికి, టోటల్ శానిటేషన్ చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లు, ఇన్సిడెండ్ కమాండర్స్, ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

అందరూ అప్రమత్తంగా ఉండాలి.
‘‘పాజిటివ్ వచ్చిన ప్రాంతాల్లో లాక్ డౌన్ నిబంధనల ప్రకారం నిత్యావసరాలకు ఇబ్బంది లేదు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తాం. పాజిటివ్ వచ్చిన ప్రాంతాన్ని మొత్తం 4 సెక్టర్లుగా విభజించి మెడికల్ బృందాలతో ఆ ప్రాంతంలో నివాసమున్న వారందరికీ  మెడికల్ స్క్ర్రీనింగ్ చేయిస్తాం. ఆ ప్రాంతమంతా క్రిమీ సంహార రసాయనాల స్ప్రే చేయించి.. శానిటేషన్ చేయిస్తున్నాం. అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇళ్లలోనే ఉండండి..బయటకు రావద్దు.. సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించండి. కోవిడ్-19 అనుమాన లక్షణాలు ఉంటే వెంటనే మెడికల్ ఆఫీసర్, మునిసిపల్ కమీషనర్,  తహశీల్దార్, ఎంపిడిఓలకు సమాచారం ఇవ్వండి. కర్నూలు కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్  ఏర్పాటు చేసాం.. కర్నూలు కరోనా కాల్ సెంటర్ 9441300005 కు లేదా 104 కు కాల్ చేసి కరోనా పై ఏవైనా సమస్యలు ఉంటే తెలుపవచ్చు. కోవిడ్-19/కరోనా పై వదంతులను/పుకార్లను పుట్టిస్తే లేదా సోషల్ మీడియాలో లేదా మీడియాలో వ్యాప్తి చేస్తే చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం’ అని జిల్లా కలెక్టర్ వీరపాండియన్ పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

05-06-2020
Jun 05, 2020, 03:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో కరోనా మరణాలు వంద దాటాయి. గురువారం ఒక్కరోజే ఆరుగురు మరణించడంతో మృతుల సంఖ్య 105కి...
05-06-2020
Jun 05, 2020, 02:56 IST
సాక్షి, హైదరాబాద్‌: కరోనాను కట్టడి చేయడంతో పాటు ప్రజలను చైతన్యపర్చడంలో టెక్నాలజీ ఎంతో మేలు చేసిందని ఐటీ పరిశ్రమల శాఖ...
05-06-2020
Jun 05, 2020, 02:50 IST
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కంటైన్మెంట్‌ జోన్ల వెలుపలి ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులిచ్చింది. లాక్‌డౌన్‌ ప్రకటించడానికి పూర్వం అనుమతించిన...
05-06-2020
Jun 05, 2020, 01:15 IST
లాక్‌డౌన్‌ ప్రకటించగానే వాళ్లెందుకు నడుస్తున్నారు? సరదానా, పనీపాటా లేకనా, మధుమేహం రోగమా? సొంతూరికి బయలు దేరి వేలమైళ్లదూరాలు దాటడానికి అడుగులేస్తూ...
05-06-2020
Jun 05, 2020, 00:23 IST
‘ఎక్స్‌ప్రెస్‌ రాజా’ (2016), ‘జెంటిల్‌మేన్‌’ (2016), ‘ఒక్కక్షణం’ (2017) చిత్రాల్లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల చేత మంచి మార్కులు...
05-06-2020
Jun 05, 2020, 00:12 IST
కరోనా ప్రభావం రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ విపత్కర వ్యాధి ప్రబలకుండా యావత్‌ దేశాలు శక్తి మేర కృషి చేస్తున్నాయి....
04-06-2020
Jun 04, 2020, 21:34 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 127 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3147కి చేరింది. తాజా కేసుల్లో...
04-06-2020
Jun 04, 2020, 20:23 IST
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయతాండవం కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 123 మంది కరోనా పేషెంట్లు మృత్యువాత...
04-06-2020
Jun 04, 2020, 19:20 IST
భోపాల్‌ : అచ్చం సినిమా సీన్‌ తరహాలో పరిగెడుతున్న రైలులో పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్న ఒక నాలుగేళ్ల చిన్నారికి పాల...
04-06-2020
Jun 04, 2020, 17:56 IST
న్యూఢిల్లీ: నిబంధనలకు విరుద్ధంగా భారత్‌లో ప్రవేశించిన దాదాపు 960 మంది తబ్లిగీ జమాత్‌ విదేశీ సభ్యులకు కేంద్ర హోం మంత్రిత్వ...
04-06-2020
Jun 04, 2020, 17:46 IST
సాక్షి, అమరావతి : కోవిడ్‌ - 19 నివారణలో భాగంగా సహాయచర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి పెద్ద ఎత్తున విరాళాలు...
04-06-2020
Jun 04, 2020, 17:21 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత్‌లో ఆహారం కొరత కారణంగా కరువు కాటకాలు ఏర్పడటం లేదు. కార్మికులకు కొనే శక్తి కరువైనప్పుడు...
04-06-2020
Jun 04, 2020, 15:30 IST
సాక్షి, విజయవాడ : కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జూన్‌ 8వ తేదీ నుంచి రాష్ట్రంలో హోటళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు ఏపీ...
04-06-2020
Jun 04, 2020, 15:26 IST
సాక్షి, న్యూఢిల్లీ : అది మే 23వ తేదీ. ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కబీర్‌ కత్రి...
04-06-2020
Jun 04, 2020, 14:19 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం...
04-06-2020
Jun 04, 2020, 14:00 IST
సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ బాధితుడి ఇంటికి కన్నం వేశారు దొంగలు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌...
04-06-2020
Jun 04, 2020, 13:49 IST
ఆలేరు రూరల్‌:  మండలంలోని కొల్లూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మండల వైద్యాధికారిణి...
04-06-2020
Jun 04, 2020, 12:58 IST
హైదరాబాద్‌: దేశంలోకెల్లా ప్రసిద్ధి గాంచిన రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కరోనా వైరస్‌కు సంబంధించి కొన్ని దిగ్భ్రాంతికర విషయాలను...
04-06-2020
Jun 04, 2020, 11:00 IST
నాంపల్లి: నగరంలో కరోనా పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రూ.20 వేల  చొప్పున ఆర్థికసాయం అందించనున్నట్లు  తెలంగాణ ప్రెస్‌...
04-06-2020
Jun 04, 2020, 10:48 IST
వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో నరహత్యకు గురైన నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ పూర్తి శవపరీక్ష నివేదికను వైద్యులు బుధవారం విడుదల...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top