అంజన్నను దర్శించుకున్న సీఎం జగన్‌ | CM YS Jagan Visits Gandi Anjaneya Swamy Temple | Sakshi
Sakshi News home page

గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నసీఎం జగన్‌

Jul 8 2019 11:41 AM | Updated on Jul 8 2019 2:21 PM

CM YS Jagan Visits Gandi Anjaneya Swamy Temple - Sakshi

సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చక్రాయపేట మండలంలోని గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రత్యేక పూజలు నిర్వహిం‍చి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం జగన్‌ను ఆశ్వీరదించి తీర్థ ప్రసాదాలు అందించారు.

అంజన్న దర్శన అనంతరం సీఎం జగన్‌ను జమ్మలమడుగు బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్‌ అక్కడ జమ్మలమడుగులో నిర్వహించనున్న వైఎస్సార్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అంతకు ముందు సీఎం జగన్‌ వైఎస్సార్‌  70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద  అంజలి ఘటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement