breaking news
gandi anjanna
-
గండిక్షేత్ర అభివృద్ధికి పాలక మండలి శ్రమించాలి: వైఎస్ అవినాష్ రెడ్డి
చక్రాయపేట: గండి క్షేత్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసి సర్వ హంగులు దిద్దుకున్నాక జాతికి అంకితం చేస్తామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.సోమవారం గండి నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి,వేంపల్లె జెడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డిలతో కలసి హాజరయ్యారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గండి క్షేత్రం అభివృద్ధి చెందిందని చెప్పారు.అప్పట్లోనే టూరిజం రెస్టారెంట్,భక్తులు,అర్చకుల వసతి గృహాలు,సిమెంట్ రోడ్లు, పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం వంటి పనులు జరిగాయని చెప్పారు.ఆయన మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు గండిపై శీతకన్ను వేశాయన్నారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆలయం పునర్నిర్మాణానికి రు.16 కోట్లు నిధులు మంజూరు చేశారని తెలిపారు.అలాగే రాజగోపురం,ప్రహారి నిర్మాణానికి కూడా మరో రు.6కోట్ల మేర నిధులు మంజూరు చేశారన్నారు. మళ్లీ అధికారం లోకి రాగానే రెండు విడతల్లో గండిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు.మొదటి విడతలో భక్తుల సౌలభ్యం కోసం వంద గదుల నిర్మాణాం,రెండో దశలో గండిలోని టూరిజం రెస్టారెంట్‌ను పూర్తి చేస్తామని వివరించారు. గండి క్షేత్రంలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి రూ.23 లక్షలు విరాళంగా అందజేశారు.గండి అభివృద్ధికి నూతన పాలక మండలి శ్రమించాలని ఎంపీ అన్నారు. అంతకుముందు ఎంపీ గండి వీరాంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముకుందారెడ్డి, అర్చకులు పూ ర్ణకుంభ స్వాగతం పలికారు.ప్రత్యేక పూజలు చేయించారు. కుడా చైర్మన్ గురుమోహన్,ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ ప్రసాదరావు, చక్రాయపేట,వేంపల్లె ఎంపీపీలు మాధవీబాలకృష్ణ,గాయత్రి,వేంపల్లె మండల కన్వీనర్ చంద్ర ఓబుళరెడ్డి,మండల సమన్వయకర్త ఓబుళరెడ్డి,కందుల నాని పాల్గొన్నారు. అభివృద్ధికి పాటుపడుతాం చక్రాయపేట : గండి క్షేత్రం అభివృద్ధికి పాటు పడతామని ఆలయ నూతన చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలక మండలి సభ్యులు అన్నారు.సోమవారం గండి పాలక మండలి సభ్యులు ఆలయ సహాయ కమిషనర్ ముకుందారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డి, రవికుమార్ రెడ్డిల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తున్న గండి పాలకమండలి చైర్మన్, సభ్యులు చైర్మన్‌గా కృష్ణతేజ, పాలకమండలి సభ్యులుగా సుబ్బిరెడ్డిగారి జయమ్మ,కొప్పల మునీశ్వరి,ముద్ది కుమారి,బుక్కే లలితమ్మ, కలమల సోమాకళావతి,బండ్రెడ్డి చక్రపాణిరెడ్డి,పబ్బతి బిందుసాగర్,రాసినేని మధు,బోరెడ్డిగారి వెంకట రామిరెడ్డి,నారుబోయిన సుగుణమ్మ, ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రధాన అర్చకుడు కేసరి ప్రమాణ స్వీకారం చేశారు.మారెళ్లమడక సర్పంచ్ నరసింహులు,ఎంపీటీసీ సభ్యురాలు శాంతమ్మ,పులివెందుల నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి,ఆలయ మాజీ చైర్మన్ రాఘవేంద్రప్రసాద్, జేసీఎస్ కన్వీనర్ రామాంజులరెడ్డి, మండల యూత్ కన్వీనర్ రామాంజనేయరెడ్డి పాల్గొన్నారు. -
గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నసీఎం జగన్
-
అంజన్నను దర్శించుకున్న సీఎం జగన్
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం చక్రాయపేట మండలంలోని గండి ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆలయ అర్చకులు సీఎం జగన్‌ను ఆశ్వీరదించి తీర్థ ప్రసాదాలు అందించారు. అంజన్న దర్శన అనంతరం సీఎం జగన్‌ను జమ్మలమడుగు బయల్దేరారు. కాసేపట్లో సీఎం జగన్ అక్కడ జమ్మలమడుగులో నిర్వహించనున్న వైఎస్సార్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. అంతకు ముందు సీఎం జగన్ వైఎస్సార్ 70వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద అంజలి ఘటించారు. -
ఆలయ అభివృద్ధికి సహకారం
చక్రాయపేట : జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రం గండి వీరాంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన శనివారం గండి అంజన్నను దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కేసరి, రాజా ఎంపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చరిత్ర ఆయనకు వివరించారు. దాతల సహకారంతో రూ.63 లక్షలతో జరుగుతున్న పర్మినెంటు షెడ్లు, డార్మెంటరీ, క్యూలైన్ల పనులపై ఆయన ఆరా తీశారు. ఆలయ ఆవరణలో తాము పెట్టుకున్న హోటళ్లు, తోపుడు బండ్లకు గాను ఆలయ అధికారులు వారానికి రూ.200 నుంచి రూ. 500 వసూలు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆయనకు మొర పెట్టుకున్నారు. దేవదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని వారికి ఎంపీ హామీ ఇచ్చారు. మన ప్రభుత్వం వస్తే స్థానికంగా ఉన్న చిరు వ్యాపారులకు పర్మినెంటు షెడ్లు వేయించి ఉచితంగా ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బెల్లం ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ మునికుమారి, మారెళ్లమడక, సురభి, సింగిల్ విండో ప్రెసిడెంట్లు శేషారెడ్డి, సురేష్‌రెడ్డి, సింగిల్ విండో మాజీ ప్రెసిడెంటు మునిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.