సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్‌ బౌన్స్‌

CM Relief Fund Cheque Bounce In Andhra Pradesh - Sakshi

సాక్షి, కర్నూలు : ఓట్ల కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను టీడీపీ రిలీఫ్‌ ఫండ్‌గా మార్చుకున్న చంద్రబాబు నాయుడు గొప్ప కోసం ఉత్త చెక్కులు ఇచ్చి బాధితుల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లా పాణ్యం 19వ వార్డుకు చెందిన  గంగాధర్‌ రెడ్డికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద ఇచ్చిన చెక్‌ బౌన్స్‌ అయింది.

చిరుద్యోగి అయిన గంగాధర్‌ రెడ్డి భార్య జ్యోతి ఆపరేషన్‌ కోసం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద రూ. 26 వేల చెక్‌ను ప్రభుత్వం మంజూరు చేసింది. ఎన్నికల రెండు రోజుల ముందు(ఏప్రిల్‌ 9న) టీడీపీ నేతలు ఈ చెక్‌ను గంగాధర్‌కు అందజేశారు. ఈ చెక్‌ను బ్యాంకుకు తీసుకెళ్లగా అకౌంట్‌లో సరిపడ నిధులు లేకపోవడం వల్ల చెక్‌ను రిజెక్టు చేస్తున్నామని అక్కడి సిబ్బంది తేల్చి చెప్పింది. దీంతో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ పేరుతో మోసం చేశారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు కూడా బౌన్స్‌ అయిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top