ఉత్తరాంధ్ర దశ మారబోతుంది: పుష్ప శ్రీవాణి | CM Jagan Has Shown Lasting Solution To The Northern Andhra | Sakshi
Sakshi News home page

విశాఖ రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుంది: పుష్ప శ్రీవాణి

Dec 26 2019 2:41 PM | Updated on Dec 26 2019 2:47 PM

CM Jagan Has Shown Lasting Solution To The Northern Andhra - Sakshi

సాక్షి, అమరావతి : విశాఖలో పరిపాలన రాజధానితో ఉత్తరాంధ్ర దశ మారబోతుందని డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి తెలిపారు. ఉత్తరాంధ్ర వెనుకబాటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ శాశ్వత పరిష్కారం చూపించారని అన్నారు. సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధి వికేంద్రీకరణను అన్ని ప్రాంతాల ప్రజలు స్వాగతిస్తున్నారని, చంద్రబాబు వైఖరి ఉత్తరాంధ్రకు తీరని ద్రోహం చేసేలా ఉందని విమర్శించారు. విశాఖ నుంచి పరిపాలన చేస్తే ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు వస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో భవిష్యత్తులో వేర్పాటు ఉద్యమాలు రాకుండా సీఎం జగన్‌ విజన్‌తో ఆలోచించారని, జీఎన్‌ రావు కమిటీ నివేదికను అందరూ ఆహ్వనించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement