రేపు ‘జగనన్న వసతి దీవెన’కు శ్రీకారం | CM Jagan To Be Launched Jagananna Vasathi Deevena Scheme Tomorrow | Sakshi
Sakshi News home page

రేపు విజయనగరంలో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన

Feb 23 2020 3:56 PM | Updated on Feb 23 2020 4:11 PM

CM Jagan To Be Launched Jagananna Vasathi Deevena Scheme Tomorrow - Sakshi

సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో రేపు (సోమవారం) ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. జిల్లా నుంచి ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం బయలుదేరతారు. 11 గంటలకు విజయనగరం పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాలకు చేరుకుని.. అక్కడ నుంచి విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించనున్నారు. 11.25 నిమిషాలకు వైఎస్సార్‌  జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి.. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం అక్కడ నుంచి  పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్స్‌కు చేరుకుని ‘దిశ’  పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు కార్యక్రమాలు ముగించుకుని తిరిగి హెలికాఫ్టర్‌లో విశాఖపట్నం, అక్కడి నుంచి విమానంలో గన్నవరం వెళతారు. 

Advertisement
 
Advertisement
Advertisement