కంది కొనుగోళ్లలో దళారుల్ని నిరోధించండి | CM Chandrababu command to authorities | Sakshi
Sakshi News home page

కంది కొనుగోళ్లలో దళారుల్ని నిరోధించండి

Jan 17 2017 1:39 AM | Updated on Aug 14 2018 11:26 AM

కంది పంట కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

సాక్షి, అమరావతి: కంది పంట కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్విట్జర్లాండ్‌ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం ఉదయం అధికారులతో ఫోన్‌లో అంగన్‌వాడీ కేంద్రాలు, కంది గిట్టుబాటుపై మాట్లాడారు.

కంది రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నాణ్యమైన నిత్యావసరాలను మాత్రమే వినియోగించాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి 15 రోజులకోసారి తనిఖీలు నిర్వహించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement