​​​​​​​సాక్షి విలేకరిపై దాడి

CI Attack On Sakshi Journalist In Anantapur

సాక్షి, అనంతపురం : జిల్లాలోని ఇటుకలపల్లి సీఐ రాజేంద్రనాథ్‌ యాదవ్‌ దైర్జన్యానికి దిగారు. భూవివాదంలో హైకోర్టు స్టేకాపీ ఇచ్చేందుకు వెళ్లి సాక్షి విలేకరిపై దాడికి పాల్పడ్డారు. స్టేకాపీ ఇచ్చేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన రాప్తాడు విలేకరి కొండన్నపై దుర్భాషణలాడారు. గతంలో కూడా సీఐ రాజేంద్రనాథ్‌పై అనేక ఆరోపణలు వచ్చినా అధికారులు మాత్రం పట్టించుకోలేదు. కందుకూరు వైఎస్సార్‌సీపీ కార్యకర్త హత్య కేసులో నిందితులకు సహకరించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. మంత్రి పరిటాల సునీత అండతో సీఐ రెచ్చిపోతున్నారనే విమర్శలు కూడా రాజేంద్రనాథ్‌పై ఉండడం గమనార్హం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top