ఏడుపు ఆపడం లేదని కోపంతో కొట్టింది.. | child's mother beet the child ,child is died | Sakshi
Sakshi News home page

ఏడుపు ఆపడం లేదని కోపంతో కొట్టింది..

May 19 2015 6:42 AM | Updated on Sep 3 2017 2:17 AM

ఏడుపు ఆపడం లేదని కోపంతో కొట్టింది..

ఏడుపు ఆపడం లేదని కోపంతో కొట్టింది..

ఓ తల్లి క్షణికావేశం తన 8 నెలల కొడుకు మృతికి కారణమైంది. మంచంపై నుంచి కిందపడ్డ చిన్నారి నొప్పితో ఎంతకీ ఏడుపు

తిరుపతి: ఓ తల్లి క్షణికావేశం తన 8 నెలల కొడుకు మృతికి కారణమైంది. మంచంపై నుంచి కిందపడ్డ చిన్నారి నొప్పితో ఎంతకీ ఏడుపు ఆపడం లేదని కోపంతో తల్లి కొట్టింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే చనిపోయాడు.  తిరుపతికి చెందిన మోహన్‌కుమార్, కరిష్మాలకు ఏడాదిన్నర కిందట వివాహం అయింది. వీరికి ప్రభాస్(8 నెలల) కుమారుడు ఉన్నాడు. సోమవారం ఉదయం చిన్నారి ప్రభాస్ మంచంపై నుంచి కింద పడడంతో బాధ తట్టుకోలేక ఏడుస్తూనే ఉన్నాడు.

ఎంతకీ ఏడుపు ఆపకపోవడంతో కరిష్మా అసహనంతో కొడుకుని చెంపపై బలంగా కొట్టింది. దీంతో నోరు, చెవిలో నుంచి రక్తం కారి చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. తన బిడ్డను భార్యే కొట్టి చంపిందని బిడ్డ తండ్రి మోహన్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్షణికావేశంలో బిడ్డను కొట్టానని, చంపాలని అనుకోలేదని కన్నతల్లి కరిష్మా పోలీసుల ఎదుట కన్నీరుమున్నీరైంది.  కరిష్మాను పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement