పాము కాటుతో చిన్నారి మృతి | child dies of snake bite | Sakshi
Sakshi News home page

పాము కాటుతో చిన్నారి మృతి

Sep 6 2015 7:11 PM | Updated on Aug 20 2018 7:28 PM

స్నేహితులతో కలసి ఆడుకుంటున్న వేళ ఓ నాగుపాము కాటువేసి ఐదేళ్ల చిన్నారిని బలితీసుకుంది.

గార: స్నేహితులతో కలసి ఆడుకుంటున్న వేళ ఓ నాగుపాము కాటువేసి ఐదేళ్ల చిన్నారిని బలితీసుకుంది. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీపురం పంచాయతీ పరిధిలోని దువ్వుపేటలో జరిగింది. బాకి హరిత ఆదివారం అంగన్‌వాడీ స్కూల్‌కు సెలవు కావడంతో స్నేహితురాళ్లతో కలసి మధ్యాహ్నం గ్రామం సమీపంలోని కల్వర్టుపై కూర్చుంది.

కింద కాలువలో నీటి ధార వెళుతుంటే కాళ్లూపుతూ హరిత ఆడుకుంటోంది. అదే సమయంలో ఓ నాగుపాము హరిత కాలుపై కాటు వేసింది. ఏడుస్తున్న చిన్నారిని స్థానికులు శ్రీపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలిస్తుండగా మృతి చెందింది.

Advertisement
 
Advertisement
Advertisement