ఎవరి కోసం సౌభాగ్య దీక్ష చేశారు?

Cherukuwada Sri Ranganatha Raju comments on Pawan Kalyan - Sakshi

పవన్‌పై మంత్రి శ్రీరంగనాథరాజు ధ్వజం

పెనుగొండ: నాలుగు నెలల పాటు ధాన్యం బకాయిలు చెల్లించకుండా చంద్రబాబు నిధులు మళ్లిస్తే ఆనాడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎందుకు ప్రశ్నించలేదని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రశ్నించారు. రైతు పక్షపాతిగా, రైతు సౌభాగ్యం కోసమే నిరంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తూ రైతుల మన్ననలు పొందుతుంటే పవన్‌ సౌభాగ్య దీక్ష ఎవరి కోసం చేశారని ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా తూర్పుపాలెంలో మంత్రి శనివారం సాక్షితో మాట్లాడారు.

రైతులకు నేటి ప్రభుత్వం ఎక్కడా బకాయిలు పడలేదన్నారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.9 వేల కోట్లు దారి మళ్లించి రైతుల పంటకు చెల్లింపులు చేయకుండా తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని వివరించారు. దీనిపై రైతుల పక్షాన ప్రశ్నించడానికి పవన్‌ ఎక్కడా కనపడలేదన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత రైతుల బాధలు విన్నవిస్తే ఆనాటి ధాన్యం బకాయిలు చెల్లించినట్లు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top