చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ | Charminar Express robbery | Sakshi
Sakshi News home page

చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

Mar 23 2015 3:10 AM | Updated on Aug 2 2018 4:53 PM

చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో(రైలు నం.12759) శనివారం రాత్రి కొంతమంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు.

  • ఆరు బోగీల్లో మొత్తం 129 గ్రాముల బంగారు నగల అపహరణ
  • ఒంగోలు: చెన్నై నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలులో(రైలు నం.12759) శనివారం రాత్రి కొంతమంది దుండగులు దోపిడీకి పాల్పడ్డారు. ఒంగోలు రైల్వేస్టేషన్ దాటిన తర్వాత రాత్రి 11.30 గంటల అనంతరం రైలు ఆగేందుకు చైన్ లాగిన  దుండగులు మొత్తం ఆరు బోగీల్లో కిటికీల పక్కన ఉన్న మహిళల మెడల్లో బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు.

    అమ్మనబ్రోలు, ఉప్పుగుండూరు రైల్వేస్టేషన్ల మధ్య రైలును ఆపి 10 నుంచి 12 మందితో కూడిన ముఠా ఈ దోపిడీకి పాల్పడ్డట్లు రైల్వే పోలీసుల విచారణలో వెల్లడైంది. రైలు సికింద్రాబాద్ చేరిన తర్వాత పలువురు మహిళలు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement