మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు సీఎం చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించారు.
సాక్షి, అమరావతి : మాస్టర్ ఆర్కిటెక్ట్ నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన రాజధాని పరిపాలనా నగరం వ్యూహ డిజైన్లకు సీఎం చంద్రబాబు మళ్లీ కొన్ని మార్పులు సూచించారు. రెండురోజుల క్రితం ఫోస్టర్ సంస్థ ఇచ్చిన డిజైన్లపై జరిగిన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశంలో చర్చించారు.
పాలనా నగరం మీదగా నిర్మించాలనుకుంటున్న జలమార్గం, అందుకు అవసరమైన నీరు, రాజధాని భవిష్యత్తు జల అవసరాలు, పులిచింతల ప్రాజెక్టు దిగువన నిర్మించబోయే బ్యారేజీ నుంచి వచ్చే నీటిపై జలవనరుల శాఖ, బ్లూ, గ్రీన్ కన్సల్టెంట్లతో చర్చించి తుది ప్రణాళికకు స్పష్టమైన రూపు ఇవ్వాలని బాబు సూచించారు. మరోవైపు ఫోస్టర్ ఇచ్చిన వ్యూహ డిజైన్లను శనివారం అసెంబ్లీలో ప్రదర్శించాలని సమావేశంలో నిర్ణయించారు.