‘జగన్‌ హామీలు ప్రజల గుండెను తాకాయి’ | chandrababu shivering with ys jagan 9 promises, bhumana karunakar reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబు గుండె అదురుతోంది: భూమన

Jul 12 2017 2:13 PM | Updated on Jul 25 2018 4:45 PM

‘జగన్‌ హామీలు ప్రజల గుండెను తాకాయి’ - Sakshi

‘జగన్‌ హామీలు ప్రజల గుండెను తాకాయి’

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు మొదలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు.

హైదరాబాద్‌: వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన హామీలతో చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు మొదలైందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. అందుకే టీడీపీ శునకాలన్ని మొరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. భూమన బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘టీడీపీ నేతలు వరాహాల గుంపులా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. జగన్‌ హామీలు ప్రజల గుండెను తాకాయి.

దాంతో చంద్రబాబు గుండె అదురుతోంది. రైతులను ఆదుకున్న చరిత్ర వైఎస్‌ రాజశేఖరరెడ్డిది అయితే దాన్ని చిన్నాభిన్నం చేసిన ఘటన చంద్రబాబుది. చంద్రబాబులా ఓట్ల కోసం ప్రకటనలు చేసే వ్యక్తి జగన్‌ కాదు. 600 హామీలు ఇచ్చి నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉంది.’ అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement