బాబు పర్యటన నేటికి వాయిదా | Chandrababu Naidu Tour postponed | Sakshi
Sakshi News home page

బాబు పర్యటన నేటికి వాయిదా

Oct 29 2013 3:11 AM | Updated on Aug 10 2018 7:58 PM

జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జరపాల్సిన పర్యటన మంగళవారానికి వాయిదా పడింది.

సాక్షి, కాకినాడ : జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం జరపాల్సిన పర్యటన మంగళవారానికి వాయిదా పడింది. ముందు అనుకున్న ప్రకారం చంద్రబాబు విశాఖ జిల్లా నుంచి సోమవారం ఉదయం 10 గంటలకు తుని చేరుకోవాల్సి ఉంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన రాక కోసం తునిలోని తాండవ సుగర్ ఫ్యాక్టరీ గెస్ట్‌హౌస్ వద్ద వేచి చూశా రు. అయితే చంద్రబాబు రాత్రి 8.30 గంటలకు గానీ తుని చేరుకోలేక పోయారు. విశాఖ జిల్లాలో పర్యట న పూర్తి కాకపోవడమే జాప్యానికి కారణమని పార్టీ వర్గాలు తెలిపాయి. తుని నుంచి ఆయన అన్నవరం చేరుకుని దేవస్థానం అతిథిగృహంలో బస చేశారు. కాగా జిల్లాలో సోమవారం జరగాల్సిన బాబు పర్యటన యథాతథంగా మంగళవారం జరుగుతుందని పార్టీ జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement