నాటుకోడి పులుసు గురించి మాట్లాడిన చంద్రబాబు | Chandrababu Naidu talking about chicken soup | Sakshi
Sakshi News home page

నాటుకోడి పులుసు గురించి మాట్లాడిన చంద్రబాబు

Aug 5 2014 5:57 PM | Updated on Sep 2 2017 11:25 AM

చంద్రబాబు నాయుడు

చంద్రబాబు నాయుడు

ఎప్పుడు సీరియస్గా ఉండే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నోరూరించే మాటలు మాట్లాడారు.

హైదరాబాద్: ఎప్పుడు సీరియస్గా ఉండే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నోరూరించే మాటలు మాట్లాడారు. నాటుకోడి పులుసు, రాగి సంకటిల ప్రత్యేకతల గురించి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి రాసిన నవ్యాంధ్ర పుస్తకాన్ని ఈరోజు ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాటుకోడి పులుసు, రాగిసంకటి వంటి రాయలసీమ రుచులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సి ఉందన్నారు.

ఎక్కడా లేనంత సాంస్కృతిక సంపద తెలుగునాట ఉందని చెప్పారు. వీటికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాల్సి ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement