కాకినాడ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు | chandrababu naidu respond on kakinada municipal election results | Sakshi
Sakshi News home page

కాకినాడ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు

Sep 1 2017 1:04 PM | Updated on Aug 10 2018 8:27 PM

కాకినాడ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు - Sakshi

కాకినాడ ఫలితాలపై స్పందించిన చంద్రబాబు

కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.

సాక్షి, విజయవాడ : కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసే ప్రజలు టీడీపీకి ఓటు వేశారన్నారు. శుక్రవారం చంద్రబాబు నాయుడు విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. 

ప్రభుత్వంతో పాటు, తనపై కాకినాడ ప్రజలు అచంచల విశ్వాసం చూపించారని చెప్పుకొచ్చారు. మొన్న నంద్యాల, ఇవాళ కాకినాడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. వరుస ఎన్నికలతో పాలన ఇబ్బందికరంగా ఉంటుందన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా పట్టిసీమను పూర్తి చేశామని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ 32 డివిజన్లలో గెలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement