అమెరికా వెళ్లనున్న చంద్రబాబు | Chandrababu Naidu Likely Go To America On 29 July | Sakshi
Sakshi News home page

అమెరికా వెళ్లనున్న చంద్రబాబు

Jul 26 2019 8:46 PM | Updated on Jul 26 2019 8:59 PM

Chandrababu Naidu Likely Go To America On 29 July - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అమెరికా వెళ్లనున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న అమెరికా బయల్దేరనున్న చంద్రబాబు రెండు రోజుల పాటు అక్కడే వైద్య పరీక్షలు చేయించుకుంటారని పేర్కొన్నాయి. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల నుంచి వాకౌట్‌ చేసిన ఆయన సాయంత్రం నాలుగు గంటలకు మీడియా సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం హైదరాబాద్‌ వెళ్లిన చంద్రబాబు ఆదివారం వరకు అక్కడే ఉండి అనంతరం అమెరికా వెళ్లనున్నారు. వైద్య పరీక్షలు పూర్తైన తర్వాత ఆగష్టు ఒకటిన తిరిగి రాష్ట్రానికి వస్తారని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం లేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement