ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు | Chandrababu naidu going to delhi to meet arun jaitly | Sakshi
Sakshi News home page

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చంద్రబాబు

Sep 13 2014 10:28 AM | Updated on Aug 20 2018 5:17 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రత్యేక విమానంలో హస్తినకు పయనం అయ్యారు.

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ప్రత్యేక విమానంలో హస్తినకు పయనం అయ్యారు. అనారోగ్యంతో ఉన్న కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రి అరుణ్ జైట్లీని పరామర్శించనున్నారు.  ఇటీవలే జైట్లీ మధుమేహానికి సంబంధించిన శస్త్ర చికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

కాగా జైట్లీని పరామర్శించటంతో పాటు రాష్ట్ర సమస్యలపై పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.  మరోవైపు చంద్రబాబు ఆదివారం ఛత్తీస్గఢ్ రాజధాని నయా రాయ్పూర్ను సందర్శించనున్నారు. ఆ నగర నిర్మాణ తీరును చంద్రబాబు అధికారులతో కలిసి పరిశీలించనున్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement