21 నుంచి పల్లెకోనలో నాటకోత్సవాలు | celebrations in guntur district | Sakshi
Sakshi News home page

21 నుంచి పల్లెకోనలో నాటకోత్సవాలు

May 16 2014 12:20 AM | Updated on Aug 24 2018 2:33 PM

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు పరుచూరి రఘుబాబు స్మారక అఖిల భారత నాటకోత్సవాలు జరగనున్నాయి.

 భట్టిప్రోలు, న్యూస్‌లైన్: గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలం పల్లెకోనలో ఈనెల 21 నుంచి 25వ తేదీ వరకు పరుచూరి రఘుబాబు స్మారక అఖిల భారత నాటకోత్సవాలు జరగనున్నాయి. రఘుబాబు మెమోరియల్ ట్రస్టీ, సినీ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు గురువారం ‘న్యూస్‌లైన్’తో ఫోన్‌లో మాట్లాడుతూ, రఘుబాబు స్మారకంగా 2008 వరకు హైదరాబాద్‌లో ఈ నాటకోత్సవాలు నిర్వహించామన్నారు. అయితే గత నాలుగేళ్లుగా వీటిని పల్లెకోనలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏటా ఏప్రిల్ 27 నుంచి 5 రోజులపాటు నాటకోత్సవాలు జరిగేవని, అయితే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వీటిని మే 21వ తేదీకి వాయిదా వేశామన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement