బస్సు డ్రైవర్ ప్రాణాలు తీసిన 'బైక్' | Bus Driver Beaten By motorcyclists in guntur district | Sakshi
Sakshi News home page

బస్సు డ్రైవర్ ప్రాణాలు తీసిన 'బైక్'

Apr 5 2014 10:28 AM | Updated on Sep 29 2018 5:26 PM

గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో శనివారం దారుణం జరిగింది. అనుకోకుండా ఓ బస్సు ....మోటార్ బైక్ను తాకిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు.

గుంటూరు : గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో శనివారం దారుణం జరిగింది. అనుకోకుండా ఓ బస్సు ....మోటార్ బైక్ను తాకిన ఘటనలో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళితే శ్రీ చైతన్య స్కూల్ బస్సు మలుపు తిరుగుతున్న సమయంలో .... పక్కన ఉన్న బైక్ను తాకింది.

దాంతో బైక్పై ఉన్నవారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బస్సు డ్రైవర్పై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక డ్రైవర్ మృతి చెందాడు. కాగా నిందితులు పరారీలో ఉన్నట్లు సమాచారం. పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement