సంక్రాంతి సంబరం | Brownie Wallpapers | Sakshi
Sakshi News home page

సంక్రాంతి సంబరం

Jan 12 2015 1:48 AM | Updated on Mar 19 2019 9:20 PM

సంక్రాంతి సంబరం - Sakshi

సంక్రాంతి సంబరం

స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాచలంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగారుు.

వెంకటాచలం : స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాచలంలో ఆదివారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు వేడుకగా సాగారుు. మొదట నిర్వహించిన పాడుతా తీయగా పాటకచేరి అందరికీ వీనులవిందు చేసింది. చవటపాళెం పాండురంగ భక్తసమాజం ప్రదర్శించిన పండరి భజన సంస్క­ృతి, సంప్రదాయూలకు ప్రతీకగా నిలిచింది. ఎల్లా వెంకటేశ్వర్లు బృందం మృదంగవారుుద్యం అలరించింది. ముగ్గుల పోటీల్లో భాగంగా మహిళలు తీర్చిదిద్దిన రంగవల్లులు అతిథులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నారుు.

మధ్యాహ్నం వరకు సాంస్క­ృతిక కార్యక్రమాలు కొనసాగారుు. సెరైడ్‌లో ఉపాధి కోర్సులు పూర్తి చేసిన వారికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ సర్టిఫికెట్లు అందజేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి డి.జి.ఫడ్నవీస్, సినీనటుడు పవన్‌కల్యాణ్ మొదట అక్షర విద్యాలయూన్ని సందర్శించారు. అనంతరం స్వర్ణభారత్ ట్రస్ట్‌లో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాలను పరిశీలించారు.

బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బ్రిడ్జి స్కూలు విద్యార్థులకు సూచించారు. కార్యక్రమాల్లో తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, వైజాగ్ ఎంపీ హరిబాబు స్వర్ణభారత ట్రస్టీలు మాగంటి రాజేంద్రప్రసాద్, చలసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు పవన్‌కల్యాణ్ అభిమానుల ఈలలు, కేకలతో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రాంగణం మార్మోగింది.

Advertisement
 
Advertisement
Advertisement