మయూర వాహనంపై మల్లన్న | brahmotsavam festival celebrations in srisailam | Sakshi
Sakshi News home page

మయూర వాహనంపై మల్లన్న

Feb 23 2014 2:17 AM | Updated on Sep 27 2018 5:46 PM

మయూర వాహనంపై మల్లన్న - Sakshi

మయూర వాహనంపై మల్లన్న

శ్రీైశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీైశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు శనివారం రాత్రి శ్రీభ్రమరాంబా సమేతుడైన మల్లికార్జునుడు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మహాశివరాత్రి దగ్గర పడుతుండటంతో ఇప్పటికే సుమారు లక్షకు పైగా భక్తులు శ్రీశైలం చేరుకున్నట్లు అంచనా. అశేషభక్తజనం మధ్య ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను మయూరవాహనంపై అధిష్టింపజేసి అర్చకులు, వేదపండితులు విశేషపూజలు నిర్వహించారు. అనంతరం వాహన సమేతులైన ఉత్సవమూర్తులను ఆలయ ప్రదక్షిణ  చేయించి రథశాల వద్దకు చేర్చారు. అక్కడి నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం గ్రామదేవత అయిన అంకాలమ్మగుడి, నంది మండపం, క్షేత్రపాలకుడైన బయలువీరభద్రస్వామి మండపం వరకు కొనసాగింది. కాగా, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సోమవారం నుంచి మార్చి 2 వరకు మల్లన్న అలంకార దర్శనాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర్ ఆజాద్ తెలిపారు.
 - న్యూస్‌లైన్, శ్రీశైలం
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement