బీజేపీ మద్దతుతోనే తెలంగాణ: విద్యాసాగర్ రావు | BJP supported the formation of Telangana, says Vidyasagar Rao | Sakshi
Sakshi News home page

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ: విద్యాసాగర్ రావు

Nov 6 2013 12:26 PM | Updated on Sep 27 2018 5:59 PM

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ: విద్యాసాగర్ రావు - Sakshi

బీజేపీ మద్దతుతోనే తెలంగాణ: విద్యాసాగర్ రావు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు నిప్పులు చెరిగారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు నిప్పులు
చెరిగారు. బుధవారం విద్యాసాగర్ రావు హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... ప్రతిపక్షనేతగా చంద్రబాబు పూర్తిగా  విఫలం అయ్యారని ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణపై బాబు అనుసరిస్తున్న వైఖరిపట్ల బాధ్యతారాహిత్యంగా ఉందని ఆక్షేపించారు.

 

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో చంద్రబాబు పాత్ర శూన్యమని వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి వర్గ బృందం(జీఓఎం)కు ఇచ్చే నివేదికపై తమ పార్టీకి కాలపరిమితి లేదని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. భారతీయ జనతాపార్టీ మద్దతు వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అవుతుందని, తమ పార్టీ మద్దతు లేకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అసాధ్యమని విద్యాసాగర్ రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement