'రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం' | bjp oppose rayala telangana, says rajeswara rao | Sakshi
Sakshi News home page

'రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకం'

Dec 2 2013 5:34 PM | Updated on Mar 29 2019 9:18 PM

రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు డా. రాజేశ్వరరావు తెలిపారు.

హైదరాబాద్: రాయల తెలంగాణకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ అధ్యక్షుడు డా. రాజేశ్వరరావు తెలిపారు. ఎంతో మంది బలిదానాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం కోసమేనన్న విషయం కాంగ్రెస్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణ కోసం 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకుంటే..కాంగ్రెస్ మాత్రం రాయల తెలంగాణ అంశాన్ని తెరమీదకు తెచ్చి ప్రజలతో నాటకాలాడుతుందని రాజేశ్వరరావు మండిపడ్డారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడ్ని ప్రజల నిలదీయాలిన  ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 

రాయల తెలంగాణ దిశగా కేంద్రం అడుగులేస్తున్నట్టు సంకేతాలు రావడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం సాగిస్తే.. రాయల తెలంగాణ అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడం సరికాదని తెలంగాణ బీజేపీ నాయకులు హెచ్చరిస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement