రహదారిపై మోటార్‌ బైక్ దగ్ధం | Bike burnt on road | Sakshi
Sakshi News home page

రహదారిపై మోటార్‌ బైక్ దగ్ధం

Sep 11 2015 5:36 PM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల దేవస్థానం పరిధిలోని రామయ్య టర్నింగ్ వద్ద శుక్రవారం ఒక మోటార్‌బైక్ రన్నింగ్‌లో ఉండగానే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

శ్రీశైలం : శ్రీశైల దేవస్థానం పరిధిలోని రామయ్య టర్నింగ్ వద్ద శుక్రవారం ఒక మోటార్‌బైక్ రన్నింగ్‌లో ఉండగానే మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఆ బైక్‌పై మాచర్ల నుంచి శ్రీశైలం వస్తున్న ఎస్. క్రాంతి కుమార్ శ్రీశైలానికి ఒక కిలోమీటర్ దూరంలోని రామయ్య టర్నింగ్ వద్దకు రాగానే స్పార్క్‌ప్లగ్ నుంచి మంటలు చెలరేగాయని తెలిపారు. అవి పెట్రోల్ ట్యాంకుకు అంటుకుని బైక్ పూర్తిగా దగ్థమైంది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు.
 

Advertisement
 
Advertisement
Advertisement