తల పట్టుకుంటున్న బాబు | babu struggling about nominated posts | Sakshi
Sakshi News home page

తల పట్టుకుంటున్న బాబు

Jan 15 2015 3:27 PM | Updated on Jul 28 2018 6:35 PM

చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. ఈ పదవుల విషయంలో అప్పుడే తమ్ముళ్లలో విభేదాలు పొడసూపాయి.

చిత్తూరు: తెలుగుదేశం పార్టీలో నామినేటెడ్ పదవుల జాతర ప్రారంభమైంది. ఈ పదవుల విషయంలో అప్పుడే తమ్ముళ్లలో విభేదాలు పొడసూపాయి. చివరికి ఈ వివాదం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరింది. దీనికి ఆయన సమాధానమిస్తూ..పార్టీ కోసం పనిచేసిన వారెవరో, ఎవరికి ఏమివ్వాలో అంతా తనకు తెలుసన్నారని సమాచారం. ఈ విషయంలో తనను ఇబ్బంది పెట్టిన వారు ప్రభుత్వ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు సమాచారం. అసలే ప్రభుత్వం ఎన్నికల హామీలు నెరవేర్చలేక సతమతమవుతుంటే ఇప్పుడీ పదవుల పందేరం చంద్రబాబుకు తలనొప్పి తెచ్చిపెట్టినట్లు పార్టీ నాయకులు, కార్యకర్తలు వాపోతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement