వివాహితపై ఆటో డ్రైవర్ల లైంగికదాడి | Auto drivers sexual attack on married woman | Sakshi
Sakshi News home page

వివాహితపై ఆటో డ్రైవర్ల లైంగికదాడి

Oct 24 2013 1:18 AM | Updated on Sep 2 2018 5:06 PM

ఆటో డ్రైవర్లు ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రఘునాధపాలెం మండలం చిమ్మపూడిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: ఆటో డ్రైవర్లు ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన రఘునాధపాలెం మండలం చిమ్మపూడిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మంఅర్బన్ ఎస్సై సుబ్బయ్య కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. రఘునాధపాలెం మండలంలోని చిమ్మపూడి గ్రామానికి చెందిన ఓ వివాహిత(26) కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తతో విడిపోయి రెండు సంవత్సరాలుగా తల్లితో కలిసి ఉంటోంది. ఆమెకు ఓ కుమార్తె ఉంది. దసరా సెలవుల సందర్భంగా ఆమె కుమార్తె మధిర మండలంలోని ఇల్లూరులో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లింది.

ఆమెను తీసుకువచ్చేందుకు ఈ నెల 19వ తేదీన బాధితురాలి తల్లి అక్కడికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్లు లక్ష్మణ్, విజయ్‌లు ఈ నెల 19వ తేదీ రాత్రి 9 గంటల ప్రాంతంలో వివాహిత ఇంటికి వెళ్లారు. తలుపు తట్టడంతో వివాహిత తలుపు తీసింది. వెంటనే వారు ఇంట్లోకి ప్రవేశించి ఆమె నోట్లో గుడ్డలు కుక్కి ‘అరిస్తే నీ కుమార్తెను చంపుతామని’ బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో భయపడిన ఆమె ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కుమార్తెను తీసుకుని మంగళవారం ఇంటికి వచ్చిన తల్లికి ఈ విషయం చెప్పడంతో ఆమె బుధవారం పోలీసులకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సుబ్బయ్య తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement