నాడు నక్సైలైట్ల దాడిలో..నేడు దుండుగుల కాల్పుల్లో... | atmakuru police story | Sakshi
Sakshi News home page

నాడు నక్సైలైట్ల దాడిలో..నేడు దుండుగుల కాల్పుల్లో...

Apr 4 2015 6:51 PM | Updated on Sep 2 2017 11:51 PM

నాడు నక్సలైట్‌ల మెరుపుదాడిలో, నేడు దుండుగుల ఎదురు కాల్పుల్లో ఆత్మకూరు పోలీసులు నేలకొరిగిన వైనాన్ని ఆ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆత్మకూరు: నాడు నక్సలైట్‌ల మెరుపుదాడిలో, నేడు దుండుగుల ఎదురు కాల్పుల్లో ఆత్మకూరు పోలీసులు నేలకొరిగిన వైనాన్ని ఆ ప్రాంత ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

అది సరిగ్గా 2006, ఆగస్టు 18వ తేదీ రాత్రి. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నవేళ. సరిగ్గా అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా బాంబుల మోతతో ఆత్మకూరు మండలం ఉలిక్కిపడింది. ఉలికిపాటు నుంచి తెరుకునే సరికి నక్సలైట్‌లు పోలీస్ స్టేషన్‌పై మెరుపుదాడి చేసినట్లు నిర్ధారించుకున్నారు. ఈ మెరుపుదాడిలో ఎస్‌ఐ చాంద్ పాషా, ఎఎస్‌ఐ మోహినుద్దీన్, హోంగార్డు లింగయ్య మృతి చెందారు.

ఆ సంఘటనను ఆత్మకూరు ఇంకా మరువక ముందే తాజాగా శనివారం మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎదురు కాల్పులలో ఆత్మకూరు ఎస్‌ఐ డి.సిద్ధయ్య తీవ్రంగా గాయపడగా, కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో అప్పుడు జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ పోలీసు కుటుంబాలతోపాటు ప్రజలూ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
 

Advertisement
 
Advertisement
Advertisement