మాయం | As much as two 145 not pass books | Sakshi
Sakshi News home page

మాయం

Dec 22 2014 3:30 AM | Updated on Sep 2 2017 6:32 PM

ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 145 పాస్ పుస్తకాలు మాయం అయ్యాయి. మండలంలో ఈ విషయం చర్చనీయాంశమైంది.

బ్రహ్మంగారిమఠం: ఒకటికాదు.. రెండు కాదు.. ఏకంగా 145 పాస్ పుస్తకాలు మాయం అయ్యాయి. మండలంలో ఈ విషయం చర్చనీయాంశమైంది.  రేకులకుంట గ్రామ పంచాయితీ పరిధిలోని  జెడ్.కొత్తపల్లె గ్రామంలో  ప్రభుత్వ బంజరు భూమి పట్టాలు పొందిన లబ్ధిదారులకు సంబంధించిన 145  పట్టాదారు పాసుపుస్తకాలు స్థానిక వీఆర్‌ఓ  ప్రతాప్‌రెడ్డి స్వాధీనంలో ఉండేవి.  మూడు రోజుల క్రితం రెవెన్యూ కార్యాలయంలోని ఆయన ట్రంకుపెట్టెలో నుంచి ఇవి  మాయమైనట్లు సమాచారం.

ఇవి చోరీకి గురయ్యాయా.. లేక మాయం చేశారా అనేది తెలియాల్సి ఉంది.  బ్రహ్మంసాగర్ ముంపు గ్రామాలకు చెందిన వారికి డీకేటీ పట్టాలు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన లబ్ధిదారులకు ఇవ్వటానికి  పట్టాదారు పాసుపుస్తకాలు సిధ్దం చేశారు. భూములు చూపించిన అనంతరం  పాసుపుస్తకాలు పంపిణీ చేసేందుకు  తహశీల్దార్ సుబ్బరామయ్య సిద్ధంగా ఉండగా ఒక్కసారిగా ఇవి మాయమయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement