ముగిసిన ఆర్మీ జవాను అంత్యక్రియలు | army jawan killed due to current shock in uttar pradesh | Sakshi
Sakshi News home page

ముగిసిన ఆర్మీ జవాను అంత్యక్రియలు

Mar 19 2016 7:01 PM | Updated on Sep 3 2017 8:08 PM

ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఆర్మీ జవాను కిల్లాడ ఎర్రినాయుడు(36) అంత్యక్రియలు శనివారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం లంకవాని పాలెంలో సైనిక లాంచనాలతో పూర్తయ్యాయి.

కె.కోటపాడు: ఉత్తరప్రదేశ్‌లో విద్యుదాఘాతంతో మృతి చెందిన ఆర్మీ జవాను కిల్లాడ ఎర్రినాయుడు(36) అంత్యక్రియలు శనివారం విశాఖ జిల్లా కె.కోటపాడు మండలం లంకవాని పాలెంలో సైనిక లాంచనాలతో పూర్తయ్యాయి. అలహాబాద్‌లో ఆర్మీ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న ఎర్రినాయుడు ఏడాదికోసారి జరిగే సైనిక శిక్షణ, విన్యాసాల కోసం రైలులో వెళుతూ ఈ నెల 17న విద్యుదాఘాతానికి గురయ్యాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించగా అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. మృతదేహాన్ని లంకవానిపాలేనికి తీసుకొచ్చారు. ఆర్మీ, నేవీ అధికారులు సైనిక వందనం సమర్పించగా అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement