అరకు పార్లమెంట్‌కు ఐదు నామినేషన్లు | Araku Parliament Elections Nominations | Sakshi
Sakshi News home page

అరకు పార్లమెంట్‌కు ఐదు నామినేషన్లు

Mar 23 2019 8:52 AM | Updated on Mar 23 2019 8:55 AM

Araku Parliament Elections Nominations - Sakshi

సాక్షి, పాడేరు:  అరకు పార్లమెంట్‌ స్థానానికి 5వ రోజు శుక్రవారం ప్రధాన పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గొడ్డేటి మాధవి రెండు సెట్ల నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి డి.కె బాలాజీకి అందజేశారు. టీడీపీ అభ్యర్థి వైరిచర్ల కిశోర్‌ చంద్రసూర్యనారాయణ దేవ్‌ నాలుగు సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్ధి కోసూరి కాశీవిశ్వనాధ వీరవెంకట సత్యనారాయణ ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాన్ని, జనసేన అభ్యర్థి వంపూరు గంగులయ్య ఒక సెట్‌ నామినేషన్‌ను, జనజాగృతి పార్టీ అభ్యర్థి సోమెల సుబ్రహ్మణ్యం ఒక నామినేషన్, ఇండిపెండెంట్‌గా ఒక నామినేషన్‌ దాఖలు చేశారు. మొత్తం ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement