'బాబు ప్రభుత్వం చేతకాని తనం వల్లే..' | apcc chief raghu veera fires on chandrababu over special status in ananthapur district | Sakshi
Sakshi News home page

'బాబు ప్రభుత్వం చేతకాని తనం వల్లే..'

Nov 12 2015 5:38 PM | Updated on Mar 23 2019 9:10 PM

'బాబు ప్రభుత్వం చేతకాని తనం వల్లే..' - Sakshi

'బాబు ప్రభుత్వం చేతకాని తనం వల్లే..'

మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా పై ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేసిందని ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మండిపడ్డారు.

అనంతపురం: మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా పై ఆంధ్రప్రదేశ్ ప్రజలని మోసం చేసిందని ఏపీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి మండిపడ్డారు. హిందూపురంలో జరిగిన మట్టి సత్యాగ్రహంలో గురువారం ఆయన  పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి ప్రాణ వాయువవులాంటిదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేతకాని తనం వల్లే ప్రత్యేక హోదా ఇంకా రాలేదని ఆయన ధ్వజమెత్తారు.

Advertisement
 
Advertisement
Advertisement