ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి కొన్ని శాఖలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాద్ నుంచి కొన్ని శాఖలను తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్ఓడీల తరలింపు కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. బుధవారం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. ఏప్రిల్ తర్వాత తొలి విడతగా ప్రభుత్వ శాఖల తరలింపు ప్రారంభించాలని నిర్ణయించారు.
ముందుగా 9 శాఖలను తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. హోం, విద్య, వైద్య, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ, మున్సిపల్, మత్స్య, అగ్నిమాపక శాఖలను తొలి విడతలో తరలించాలని నిర్ణయించారు. నాగార్జున యూనివర్సిటీ, విజయవాడ, గొల్లపూడి ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేస్తారు.