'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి' | Ap Ngo calls seemandhra Bandh on Tomorrow | Sakshi
Sakshi News home page

'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'

Feb 12 2014 4:33 PM | Updated on Aug 18 2018 4:13 PM

'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి' - Sakshi

'సీమాంధ్ర ఎంపీలు సభను స్తంభింపచేయాలి'

తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చారు.

హైదరాబాద్ : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఏపీ ఎన్జీవోలు గురువారం సీమాంధ్ర బంద్కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ సీమాంధ్ర ఎంపీలు పార్లమెంట్లో ఆందోళన కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. పార్టమెంట్లో తెలంగాణ బిల్లు పెడితే సీమాంధ్ర ఎంపీలు పార్టీలకతీతంగా సభను స్తంభింప చేయాలన్నారు. సీమాంధ్ర బంద్ను విజయవంతం చేయాలని అశోక్ బాబు కోరారు.
 

Advertisement
 
Advertisement
Advertisement