రుణమాఫీకి సవాలక్ష మెలికలు | ap government to form a corporation for loan waiver | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి సవాలక్ష మెలికలు

Sep 15 2014 3:50 PM | Updated on Jul 28 2018 6:33 PM

రైతుల రుణ మాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలక్ష మెలికలు పెడుతూ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది.

రైతుల రుణ మాఫీ అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సవాలక్ష మెలికలు పెడుతూ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వెల్ఫేర్ కార్పొరేషన్ ఒకదాన్ని ఏర్పాటుచేసి, దానిద్వారా ఈ పథకాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. వివిధ శాఖలనుంచి వచ్చే సెస్సును ఈ కార్పొరేషన్‌కు బదిలీచేయాలని సోమవారం నిర్వహించిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ నెలాఖరు నాటికి కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తారు. కార్పొరేషన్‌ నిధులు, ఆస్తులు తనఖాపెట్టి బ్యాంకులకు సెక్యూరిటీలు ఇవ్వాలని నిర్ణయించారు.

పెన్షనర్ల ఎంపికకు జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటుచేస్తారు. ఇన్‌ఛార్జి మంత్రి నేతృత్వంలో ఈ కమిటీలు ఉంటాయి. అందులో మంత్రితోపాటు జిల్లా కలెక్టర్‌, డీఆర్డీఏ పీడీలను చేర్చాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. అనర్హుల తొలగింపు, లబ్ధిదారుల ఎంపిక లాంటి వ్యవహారాలన్నీ ఈ కమిటీయే చూసుకుంటుంది. ఇక కౌన్సెలింగ్‌ ద్వారా టీచర్ల బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement