పర్మినెంట్‌ అన్నారు.. మోసం చేశారు.. | AP Employees Union President KR Suryanarayana Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు ఉద్యోగులను చంద్రబాబు మోసం చేశారు..

Feb 9 2020 4:42 PM | Updated on Feb 9 2020 4:59 PM

AP Employees Union President KR Suryanarayana Comments On Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ: కాంట్రాక్ట్‌ ఉద్యోగులను మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మోసం చేశారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఆర్‌ సూర్యనారాయణ మండిపడ్డారు.  ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పర్మినెంట్‌ చేస్తామన్న మాయమాటలతో ఐదేళ్లు కాలయాపన చేశారని ధ్వజమెత్తారు. మాట ఇస్తే మడమ తిప్పని క్రెడిబిలీటీ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని అన్నారు.

కాంట్రాక్ట్‌ వర్కర్లను పర్మినెంట్‌ చేస్తానని సీఎం వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారన్నారు. సీపీఎస్‌ రద్దు, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. కొత్తగా మహిళా, రిటైర్డ్‌ ఉద్యోగుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ‘దిశ చట్టం’తో మహిళలకు సీఎం జగన్‌ అండగా నిలిచారని సూర్యనారాయణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement