రేపు కర్నూలుకు  విద్యాశాఖ మంత్రి రాక 

Ap Education Minister Will Come Kurnool 1st july - Sakshi

సాక్షి, కర్నూలు : రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డా.ఆదిమూలపు సురేష్‌ సోమవారం జిల్లాకు వస్తున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మొదటిసారి జిల్లాకు వస్తున్నారు. కర్నూలు జొహరాపురం రోడ్డులోని జార్జ్‌ విద్యా సంస్థల చైర్‌పర్సన్‌ థెరిస్సామ్మ కుమారుడే ఈయన. అయితే మంత్రి ఎక్కడ పర్యటిస్తారన్న విషయంపై మాత్రం కచ్చితమైన సమాచారం లేదు. అయితే ప్రభుత్వ విద్యాసంస్థలను తనిఖీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమం ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశం ఉంది. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి రోడ్డు మార్గాన ఉదయం 9 గంటలకు కర్నూలు చేరుకుంటారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4 గంటలకు  కర్నూలు నుంచి విజయవాడ బయలుదేరివెళ్తారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top