
సాక్షి, అమరావతి: ‘మానవతా విలువలను, ఉన్నతమైన ఆదర్శాలను రామాయణం అడుగడుగునా మనకు బోధిస్తుంది. అటువంటి గొప్ప కావ్యాన్ని రచించిన ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి నేడు. రామ కావ్యం వెలుగుల్లో మానవాళి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ వాల్మీకి జయంతి శుభాకాంక్షలు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ట్వీట్ చేశారు. కాగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో వాల్మీకులు ఎక్కువగా ఉన్న జిల్లాను గుర్తిం చి రాష్ట్రస్థాయి వేడుకలు నిర్వహించాలని, ఇందుకోసం అనంతపురం జిల్లాకు రూ.19లక్ష లు కేటాయించగా..ఇతర జిల్లాలకు రూ.55 వేలు చొప్పున మంజూరు చేశారు.