చంద్రబాబు సమీక్షలపై ఫిర్యాదులు అందాయి : ద్వివేది

AP CEO Dwivedi Says Got Complaints On CM Chandrababu Review Meetings - Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ శాఖలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షలపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమకు ఫిర్యాదు చేసిందని ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఇందులో భాగంగా ప్రజా వేదికలో చంద్రబాబు సమావేశాల నిర్వహణపై వైఎస్సార్‌ సీపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నివేదిక కోరతామని వెల్లడించారు. గురువారమిక్కడ ద్వివేది విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయని.. వాటిపై జిల్లా కలెక్టర్ల  నివేదికలు కోరామని తెలిపారు. ఎన్నికల విధుల్లో తప్పుచేసిన వారిపై తప్పకుండా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.

ఎన్నికల నిర్వహణ ఖర్చు రూ. 600 కోట్లు..
ఎన్నికల నిర్వహణలో జిల్లాల అధికారులు కష్టపడి పనిచేశారని ద్వివేది పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ కోసం దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయని.. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రూ. 300 కోట్లు వెచ్చించిందని తెలిపారు. ఇందులో పోలీసు సిబ్బంది  కోసం రూ. 180 కోట్లు వ్యయమైందని వెల్లడించారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది రెమ్యూనరేషన్ వివాదాలు పరిష్కరించమని జిల్లా కలెక్టర్లకు ద్వివేది సూచించారు. ఎన్నికల సంఘం గైడ్ లైన్స్ ప్రకారం సిబ్బందికి చెల్లింపులు జరపాల్సి ఉంటుందని తెలిపారు.

చదవండి : సీఎం చంద్రబాబు సమీక్షలకు సీఎస్‌ దూరం

కాగా పోలింగ్‌ ముగిసినప్పటికీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి వచ్చే నెల 27వ తేదీ వరకు అమల్లో ఉన్న సంగతి తెలిసిందే. అప్పటి వరకు ముఖ్యమంత్రిగానీ, మంత్రులు గానీ ఎటువంటి అధికారిక సమీక్షలు నిర్వహించరాదని ఎన్నికల నియావళి స్పష్టం చేస్తోంది. కేవలం ప్రకృతి వైపరీత్యాల సంభవించిన సమయంలో లేదా శాంతి భద్రతలకు విఘాతం సంభవించడం వంటి అత్యవసర పరిస్థితిల్లో చక్కపెట్టేందుకు మాత్రమే సీఎం వ్యక్తిగత పర్యవేక్షణ, సమీక్ష చేయవచ్చునని, మిగతా ఎటువంటి సమీక్షలు చేయరాదని ఎన్నికల ప్రవర్తనా నియామవళి స్పష్టం చేస్తోంది. అయితే గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ఇప్పుడు నియావళిని తుంగలో తొక్కుతూ నిన్న (బుధవారం) పోలవరం ప్రాజెక్టుపై ప్రజావేదిక నుంచి సమీక్ష నిర్వహించగా గురువారం  ఏకంగా సచివాలయానికి వచ్చి సీఎం కుర్చీలో కూర్చుని మరీ సీఆర్‌డీఏ పనులపై సమీక్ష నిర్వహించి అందరినీ విస్మయపరిచారు.

మరిన్ని వార్తలు

22-05-2019
May 22, 2019, 18:28 IST
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణాలో భువనగిరి  పార్లమెంటు స్థానానికి ప్రత్యేకత ఉందని, తనను గెలిపించేందుకు కృషి చేసిన కార్యకర్తలకు ధన్యవాదాలని...
22-05-2019
May 22, 2019, 18:01 IST
వంద మందిని తిన్న రాబందు ఒక్క గాలి వాన‌కు నేల కూలుతుంద‌న్న‌ది..
22-05-2019
May 22, 2019, 17:45 IST
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రేపు(23న) వెలువడనున్న నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను కేంద్ర హోంశాఖ అలర్ట్‌ చేసింది. కౌంటింగ్‌ సందర్భంగా...
22-05-2019
May 22, 2019, 17:27 IST
అది ప్రజలను అవమానించడమే..
22-05-2019
May 22, 2019, 17:05 IST
సాక్షి, అమరావతి : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘనవిజయం సాధిస్తుందని అన్ని సర్వే సంస్థలు, మీడియా రిపోర్టుల ఎగ్జిట్‌...
22-05-2019
May 22, 2019, 16:28 IST
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుపై తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి...
22-05-2019
May 22, 2019, 16:06 IST
పార్టీ శ్రేణుల్లో భరోసా నింపిన రాహుల్‌, ప్రియాంక..
22-05-2019
May 22, 2019, 15:22 IST
వీవీప్యాట్ల లెక్కింపు : విపక్షాల వినతిని తోసిపుచ్చిన ఈసీ
22-05-2019
May 22, 2019, 15:15 IST
నామినేషన్ల గట్టం పూర్తయ్యే వరకు ఏ నియోజకవర్గంలో ఎవరు, ఎంత మంది నిలబడతారో తెలియదు. అలాంటప్పుడు ముందుగా ట్యాంపరింగ్‌ చేయడం...
22-05-2019
May 22, 2019, 14:55 IST
రిగ్గింగ్‌లో మీ ప్రమేయం ఉందా..?
22-05-2019
May 22, 2019, 13:40 IST
చంద్రబాబు నాయుడిని చూస్తే జాలిగా ఉందని, ఆయన మరీ దిగజారిపోతున్నారని...
22-05-2019
May 22, 2019, 13:37 IST
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఎన్నికల్లో సర్వీస్‌, పోస్టల్‌ బ్యాలెట్లు ఓట్లు భారీగా పోలైనట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. పోస్టల్‌...
22-05-2019
May 22, 2019, 12:19 IST
డిచ్‌పల్లి: రేపు నిర్వహించనున్న పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు  డిచ్‌పల్లిలోని సీఎంసీ కళాశాల కౌంటింగ్‌ కేంద్రం వద్ద అధికారులు ముమ్మరంగా...
22-05-2019
May 22, 2019, 11:52 IST
సాక్షి, తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం తాలూకా ఆఫీస్‌ సెంటర్‌. పట్టణానికి పెద్ద ల్యాండ్‌ మార్కు. ఎన్నికలొస్తే చాలు. ఇక్కడ సందడే సందడి....
22-05-2019
May 22, 2019, 11:37 IST
సాక్షి, శ్రీకాకుళం : శ్రీకాకుళం నియోజకవర్గంలోని శాసనసభ బరిలో నిలిచిన అభ్యర్థులు, వారి అనుయాయులు లెక్కలు కట్టడంలో నిమగ్నమయ్యారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే...
22-05-2019
May 22, 2019, 11:35 IST
లక్నో : గత ఏడాది ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం బులంద్‌షహర్‌ ప్రాంతంలోని నయాబన్స్‌ గ్రామంలో చేలరేగిన హింసాకాండ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన...
22-05-2019
May 22, 2019, 11:25 IST
సాక్షి, అమరావతి బ్యూరో : సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపునకు మరో 24 గంటల సమయమే ఉంది. ఫలితాలపై అభ్యర్థులతోపాటు జిల్లా...
22-05-2019
May 22, 2019, 11:09 IST
సాక్షిప్రతినిధి, నల్లగొండ : మరో ఇరవై నాలుగు గంటలు గడిస్తే చాలు.. విజేతలు ఎవరో తేలిపోతుంది. ఉమ్మడి జిల్లాలోని భువనగిరి,...
22-05-2019
May 22, 2019, 11:08 IST
ఏపీలో ఎన్నికల కౌంటింగ్‌ను నిలిపి వేయించడానికి చంద్రబాబు చేయని కుతంత్రం లేదు.
22-05-2019
May 22, 2019, 10:59 IST
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సిక్కోలు జిల్లా... టీడీపీ ఆవిర్భావం నుంచీ కంచుకోటగా ఉంది! పది అసెంబ్లీ స్థానాల్లో ఇచ్ఛాపురం మినహా మిగిలిన...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top